కాంగ్రెస్ పార్టీ హాయంలోనే గ్రామాల అభివృద్ధి ఎమ్మెల్యే మందుల సామెల్
తిరుమలగిరి 09 జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండల పరిధిలోని మామిడాల వెలిశాలగ్రామపంచాయతీలలో అంగన్వాడి, గ్రామపంచాయతీ బవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాలు గ్రామపంచాయతీలు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు, గత బి ఆర్ ఎస్ పాలనలో గ్రామ గ్రామాలన్నీ నిరుపయోగంగా ఉండి ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు కనీసం గ్రామాలకు ప్రజలు వెళ్లడానికి రోడ్డు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి తుంగతుర్తి నియోజకవర్గంలో కాలంలోనే సుమారు 200 కోట్లతో అన్ని గ్రామాలకు రోడ్లు సాగు తాగునీరు పాఠశాల భవనాలు మంచిని ట్యాంకులు నిర్మించామని అని చెప్పారు తిరుమలగిరి మండలంలో అన్ని గిరిజన తండాలకు బిటి రోడ్లను నిర్మించామని ఆయన చెప్పారు తొండ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని అని చెప్పారు అలాగే గ్రామాలలో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించడానికి కృషి చేస్తానని అని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ హరిప్రసాద్ ఎంపీడీవో లాజర్ డి ఈ బాబురావు అంగన్వాడి సూపర్వైజర్లు ఎండి కైరునిస కందుకూరి మంగమ్మ మండల పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ జుమిలాల్ నాయక్ జిల్లా నాయకులు సుంకరి జనార్ధన్ వీరేష్ గ్రామ పార్టీ అధ్యక్షులు గజ్జి లింగయ్య , ఖమ్మం సతీష్ వేణు రావు అంబేద్కర్ యాకయ్య భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.