అడ్డగూడూరు స్టేజి వద్ద ఎక్స్ ప్రెస్ బస్సులు ఆపాలి!

అడ్డగూడూరు17 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు చౌల్లరామారం అడ్డగూడూరు ఎక్సురోడ్డు ఆర్ టి సి బస్సులు ఆపాలని ప్రజలు ప్రయాణికులు కోరుతున్నారు. జాతీయ రహదారి పనులలో భాగంగా చౌల్లరామారం స్టేజీ నుండి అడ్డగూడూరు ఎక్సురోడ్డు వరకు సర్వీసు రోడ్డు ఇరువైపులా బారీకేడ్ లు ఏర్పాటు చేశారు. అడ్డగూడూరు ఎక్సు రోడ్డు వద్ద ఆపకుండా చౌల్లరామారం స్టేజీ వద్ద బస్సులు ఆపడంతో ప్రయాణికులు నడుచుకుంటూ బారీకేడ్ ల చుట్టూ నడవాల్సివస్తోంది.లగేజీ, పిల్లలతో నడుచుకుంటూ వస్తున్నందుకు ఇబ్బందులు పడుతున్నారు. చౌల్లరామారం అడ్డగూడూరు ఎక్సు రోడ్డు సర్వీసు రోడ్డు వద్ద ప్రతి బస్సుఆపే విధంగా సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ప్రయానికులు కోరుతున్నారు.