కలెక్టర్ చొరవ తో రోడ్డు మరమ్మత్తు పనులు

Oct 31, 2025 - 20:12
 0  1
కలెక్టర్ చొరవ తో రోడ్డు మరమ్మత్తు పనులు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ కలెక్టర్ చొరవ తో రోడ్డు మరమ్మత్తు పనులు. ఆత్మకూర్ ఎస్.. మండల పరిధిలోని నెమ్మికల్ శ్రీ దండు మైసమ్మ ఆలయ సమీపంలో వర్షాల కారణంగా వరద తాకిడికి గంతలు పడి రాకపోకల కు అంతరాయం ఏర్పడిన రోడ్డు తాత్కాలిక మరమ్మతు పనులు కలెక్టర్ చొరవతో శుక్రవారం పూర్తి అయ్యాయి. గత 3రోజుల క్రితం వచ్చిన తుఫాను కు గుంతలతో పాటు రోడ్డు కోత కు గురి కావడం తో గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సంఘటన స్థలానికి చేరుకొని మరమ్మతులు చేపట్టి రవాణా పునరుద్ధరణ చేయాలని ఆదేశించారు. శుక్రవారం అర్ అండ్ బి అధికారులు కోత కు గురై గుంతల రోడ్డు పనులు తాత్కాలికంగా చేపట్టారు. పనుల సమయం లో కొద్ది సేపు ట్రాఫిక్ జామ్ అయింది. అదే విధంగా సూర్యాపేట దంతాలపల్లి రోడ్డు పై కుడకుడ నుండి నూతనకల్ వరకు రోడ్డుపై ఏర్పడిన గుంతల ను పూడ్చివేశారు. నిత్యం వేలాది వాహనాలు ప్రజలు ప్రయాణించే ఈ రోడ్డు విస్తరణ చేసి పూర్తి స్థాయిలో బిటి వేసి శాశ్వత పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.