కలెక్టరేట్ దారిలో ఘోర రోడ్డు ప్రమాదం..
వీధిలైట్లు రావట్లేదని చెప్పిన పట్టించుకోని అధికారులు..
జంక్షన్ దగ్గర హెచ్చరిక బోర్డులు లేక వారానికి ఒక ప్రమాదం..
జిల్లా బాస్... మా సమస్యలు పట్టించుకోండి..
పేరుకే కలెక్టర్ ఆఫీస్ రోడ్డు నిత్యం జిల్లా ప్రజలు వివిధ పనుల మీద వచ్చి వెళ్తుంటారు.సూర్యాపేట జిల్లా ప్రజలు ఉదయం, సాయంత్రం మార్నింగ్ వాక్కు చేస్తుంటారు. ఒక కాలేజీ, రెండు స్కూల్స్ ఉన్న ఇలాంటి రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు లేక రాత్రి అయితే వీధిలైట్లు లేక ఉన్నా కానీ సరిగ్గా పని చేయక అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మాన్యువల్సు ఒకటి పైకి ఒకటి కిందికి అస్తవ్యస్తంగా ఉండటం జంక్షన్ దగ్గర హెచ్చరిక బోర్డులు లేకపోవడం పిచ్చిగా పెరిగిన మొక్కలు, మలుపు తిరిగే కాడ అవతల బండి ఇవతలి వారికి కనపడకుండా ఉండటం ఇలాంటి సమస్యలు తీవ్రంగా ఉండటం వల్ల వారం రోజులకు ఒకసారి యాక్సిడెంట్లు అవడం కొంతమంది ప్రాణాలు పోవటం, కొంతమంది కాళ్లు చేతులు విరగడం జరుగుతుంది ఉదయం నుండి సాయంత్రం దాకా కొంతమంది ఆకతాయిలు విచక్షణ రహితంగా బండ్లు తోలటం వల్ల ఈ ఏరియాలో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా బాస్ స్పందించి ఈ సమస్యల మీద తక్షణమే చర్చించి తగిన పరిష్కారం చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.