ఉద్యమకారులు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు
మునగాల 14 సెప్టెంబర్ 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
గంట నాగయ్య భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) జిల్లా ప్రధాన కార్యదర్శి
కమ్యూనిస్టులు, ప్రజా ఉద్యమకారులు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని రేఖ తిరపయ్య సంతాప సభ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU)జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య అన్నారు. మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో అనారోగ్యంతో గత కొన్ని రోజుల క్రితం మృతి చెందిన రేఖ తిరపయ్య సంతాప సభ సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గ్రామ శాఖ కార్యదర్శి ధరావత్ రవి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముందుగా తిరపయ్య చిత్రపటానికి పూలమాలవేసి రెండు నిమిషాలు మనం పాటించి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సంతాప సభలో ముఖ్యఅతిథిగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య పాల్గొని మాట్లాడుతూ కమ్యూనిస్టులు పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం ఉద్యమిస్తూ వారి పక్షాన పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వారు అన్నారు. ప్రతి మనిషికి పుట్టుక చావు అనేది సహజం కానీ కమ్యూనిస్టులు మాత్రం మరణించిన ప్రజల హృదయాల్లో బతికే ఉంటారని వారన్నారు. రేఖ తిరపయ్య గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బారిన పడి మృతి చెందడం బాధాకరమైన విషయం కానీ కొక్కిరేణి గ్రామ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాడని వారు అన్నారు. గత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఒకటవ వార్డు మెంబర్ గా గెలుపొంది ప్రజల శ్రేయస్సు కోసం పనిచేశాడని తెలిపారు. తన వార్డులోని ప్రజల సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశాడని అన్నారు. కార్మికునిగా, రైతుగా, కుటుంబ యజమానిగా తన బాధ్యతలను నిర్వహిస్తూ ఉద్యమంలో భాగస్వామ్యమై ముందుకు కొనసాగాడని అన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను, రైతులను, పేద ప్రజలను కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని వారి స్వార్థ రాజకీయాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే అనేక వాగ్దానాల మాటలు చెబుతున్నారు తప్ప ఆచరణ మాత్రం సాధ్యం కావడం లేదని వారు మండిపడ్డారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి కార్మికుల నెత్తిన మోయరాన్ని భారాన్ని మోపి అన్యాయానికి గురిచేస్తుందని వారు అన్నారు. కార్మిక హక్కుల కోసం పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఉద్యమించే ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కామల నవీన్, జిల్లా సహయ కార్యదర్శి వక్కవంతుల నరసింహారావు, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ గ్రామ సీనియర్ నాయకులు యల్లవుల సైదయ్య, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ గ్రామ నాయకులు డి సైదా, గడ్డం సైదులు, పొన్నం బ్రహ్మం, ముస్కుల వీరయ్య, కోటయ్య, కామల్ల శ్రీను, కళింగరాజు, రేఖ నాగరాజు, బాలయ్య రేఖ తిరపయ్య కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.