చలో బోనగిరి

Apr 22, 2024 - 16:35
 0  2
చలో బోనగిరి

తుంగతుర్తి:ఏప్రిల్ 21 తెలంగాణ వార్త ప్రతినిధి:-  తుంగతుర్తి మండల పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్దనుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా  సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేయుటకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మంత్రులు పలువురు శాసనసభ్యులకు స్వాగతం పలకడానికి తరలి వెళ్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగంటి సత్యనారాయణ వాహనాలకు జెండా ఊపి కార్యకర్తలు వాహనాలు ఎక్కి భువనగిరికి తరలి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆదేశాల మేరకు శాసనసభ్యులు మందుల సామిల్ పిలుపుమేరకు తుంగతుర్తి మండలం నుండి భారీగా వాహనాలు ముఖ్య కార్యకర్తలు భువనగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం భారీ జనంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కదిలి రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి పట్టణంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్ ఎస్ యు ఐ యువజన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333