విద్యుత్ పోరు గుండెల్లో బుల్లెట్ల వర్షం
బషీర్బాగ్ మారణకాండ కు 24 ఏళ్లు.
ప్రైవేటీకరణ వైపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు .
సమైక్య ఉద్యమాలే శరణ్యం .
ప్రైవేటీకరణను అడ్డుకునే ప్రజా పోరాటాలు విస్తృతంగా రావాలి.
-- వడ్డేపల్లి మల్లేశం .
---28....08...2024(ప్రత్యేకమైన వ్యాసం)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాలంలో విద్యుత్ సంస్కరణలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చార్జీల పెంపును నిరసిస్తూ సాగినటువంటి ప్రజా ఉద్యమంపై బుల్లెట్ల వర్షం కురిపించిన ప్రభుత్వం ముగ్గురి ని పొట్టన పెట్టుకోవడంతో పాటు అనేకమందికి గాయాలైన చారిత్రక సంఘటన ప్రజా ఉద్యమకారులను, ప్రజలను ,ప్రజాస్వామ్యవాదులను ఇప్పటికీ తట్టి లేపుతూనే ఉన్నది . ఇప్పటికీ కేవలం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఏడుసార్లు కరెంటు చార్జీలు పెంచినట్లుగా తెలుస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం లోపల కూడా కెసిఆర్ ప్రభుత్వము ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూనే , మోటర్లకు మీటర్లు పెట్టాలనే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూనే విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారాన్ని మోపినటువంటి విషయాలను ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. ఆదర్శవంతమైన మాటలు మాట్లాడినప్పటికీ పాలకవర్గాలు ప్రజల పక్షాన కాకుండా పెట్టుబడిదారుల వైపే ఉంటారని అనేక సందర్భాల ద్వారా మనకు తెలుస్తూనే ఉన్నది. ఇ0 దుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవి కూడా మినహాయింపు కాదు .తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు ఉచిత కరెంటు పేరుతో ప్రచారంలో ఉన్నప్పటికీ విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు రుణపడి ఉన్నట్లు తెలుస్తున్నది .మరొక్కవైపు కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణ బిల్లును ప్రవేశపెట్టి ప్రజల నుండి ముక్కు పిండి అధిక చార్జీలను వసూలు చేయాలని, వ్యవసాయదారుల మోటార్లకు మీటర్లు పెట్టి ఉచిత కరెంటు కాకుండా చార్జీలు వసూ లు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశిస్తూ కేంద్రంతో సహకరించని రాష్ట్రాలకు నిధుల మంజూరులో వివక్షత చూపుతున్న విషయాన్ని గమనించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించగా తెలంగాణ మాత్రం మీటర్లు పెట్టడానికి అంగీకరించక వ్యతిరేకించిన విషయాన్ని కూడా మనం గమనించాలి .ప్రజలపై భారం మోపి విద్యుత్ ఛార్జీలను ఇష్టారాజ్యంగా పెంచుతూ పోతే ప్రజల కొనుగోలు శక్తి ,దేశ ఆర్థిక వ్యవస్థ , వ్యవసాయ రంగం కూడా సంక్షోభంలో కోరుకుపోతుంది అనే ఉద్దేశంతో 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై సాగిన పోరాటం బషీర్ బాగ్ మారనకాండగా చరిత్రలోకి ఎక్కిన విషయాన్ని స్మరించుకోవడంతోపాటు ఆనాటి మృతవీరుల పోరాట స్ఫూర్తిని నేటి సమాజం పునికి పుచ్చుకోవలసిన అవసరం ఉంది .
ఆగస్టు 28 సంఘటన పూర్వ నేపథ్యం :-
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలంగాణ ఉద్యమానికి బీజాలు పడ్డ సందర్భంలో భువనగిరి వరంగల్ సూర్యాపేట వంటి చోట్ల జరిగిన బహిరంగ సభలు భువనగిరి సభలో గద్దర్ పాటలు నాటి ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడును ఆలోచింపచేసినవి. ప్రపంచ బ్యాంకు ఆదేశాల ముసుగులో పనిచేస్తున్న ప్రభుత్వాలు మరింత నిర్బంధము అణచివేతను కొనసాగించే క్రమంలో విద్యుత్ చార్జీలను పెంచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే సందర్భంలో తెలంగాణ వాదం బలపడే ప్రమాదాన్ని పసిగట్టిన నాటి ప్రభుత్వం 19 97 ఏప్రిల్ 6 తేదీన గద్దర్ పై కాల్పులకు కారణమై తెలంగాణ వాదాన్ని తాత్కాలికంగా ఆపాలని చూసినప్పటికీ తెలంగాణ వాదం ఉవ్వెత్తున ఎగిసి పడ్డది .అదే రకంగా పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా సాగిన ప్రజా పోరాటం కూడా నాటి పరిస్థితులు పాలకుల నేపథ్యానికి ఉదాహరణగా తీసుకోవాల్సిన అవసరం ఉంది .
అప్పటిదాకా ప్రభుత్వ రంగ సంస్థలే విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ప్రజలకు వ్యవసాయ రంగాలకు సేవా రంగాలకు ప్రైవేటు పరిశ్రమ లకు కూడా సరఫరా చేస్తున్న తరుణంలో ప్రపంచ బ్యాంకు సంస్కరణలో భాగంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి ఆనాటి A P S E B ని మూడు ముక్కలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయంలో భాగంగా నాలుగేళ్ల పాటు ప్రతి సంవత్సరం 15% విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ఒప్పందం జరిగింది. మొదటి దఫా చార్జీల పెంపుదలను 2000 సంవత్సర ప్రారంభంలో వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఆనాటి 9 వామపక్ష పార్టీలు ప్రజాసంఘాలు ప్రజాస్వామికవాదు ల ఆధ్వర్యంలో ప్రారంభమైన పోరాటం వినూత్నంగా కొనసాగగా బిజిలి బందు రాష్ట్ర ప్రజలందరూ సంపూర్ణంగా గంటపాటు రాత్రిపూట నిర్వహించడంతోపాటు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ప్రజా బ్యాలెట్ లో లక్షలాది మంది పాల్గొన్నారు .దాని ప్రకారంగా 99 శాతం మంది విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకించినట్లు శాసనసభ్యులు మంత్రుల ఘేరావులతోపాటు ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకతకు పరాకాష్టగా 2000 సంవత్సరం ఆగస్టు 28 తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ఆంగ్లేయ పాలకుల మనస్తత్వాన్ని పు నికి పుచ్చుకున్న తెలుగుదేశం ప్రభుత్వం 1913లో జరిగిన జలియన్వాలాబాగ్ మారణకాండలాగా పాశ వికంగా ఉద్యమాన్ని అణిచివేయాలని చూసినది . ఉవ్వెత్తున కొనసాగిన ప్రదర్శనను బషీర్బాగ్ వద్ద అడ్డుకున్న ప్రభుత్వం పోలీసుల తుపాకీ తూటాలకు వందల సంఖ్యలో గాయాల పాలు కాగా రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామి, అనే ముగ్గురు అమరులైనారుఆ అమరుల త్యాగం పోరాడిన వారి ప్రజా దృక్పథం వృధా కాలేదు. ఆనాడు విద్యుత్ ప్రవేటీ కరణ ఆగిపోవడంతో పాటు నేటికీ ఉచిత విద్యుత్ ప్రభుత్వ రంగంలోనే అందుతున్నదంటే ప్రజా ఉద్యమ ఫలితమే అని చెప్పక తప్పదు . విద్యుత్ బోర్డు మూడు ముక్కలు కావచ్చు కానీ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతున్న కారణంగా బలహీన వర్గాలకు ,పేదల కాలనీలకు, ఇతర వృత్తి పనివారలకు , మంచినీటి సరఫరాకు, స్థానిక సంస్థలకు విద్యుత్ సరఫరా రాయితీలపైన సరఫరా చేస్తున్నారంటే ప్రభుత్వ రంగంలో కొనసాగడమే ప్రధాన కారణమని చెప్పక తప్ప దు.
విద్యుత్ శక్తి ఆనాడు రాష్ట్ర జాబితాలో ఉంటే ప్రజలు పోరాడి హక్కులను సాధించుకున్నారు కానీ ఆ తర్వాత కేంద్ర జాబితాలోకి వెళ్లిపోయిన తర్వాత పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెరిగినట్లుగానే విద్యుత్ ఛార్జీలను కూడా నిరంతరం పెంచాలని ఆలోచనతో విద్యుత్ సవరణ చట్టం తీసుకురావడం ఆ చట్ట ప్రకారంగా విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అన్నీ ప్రైవేటు వారికి కారు చౌకగా అప్పగించడానికి కేంద్రం ఇటీవల ప్రైవేటీకరణను వేగ వంతం చేసింది. ఆదాని అంబానీలకు లాభాలు వచ్చే విధంగా విద్యుత్ చార్జీలను నిర్ణయించి 20 శాతానికి మి0 చి సబ్సిడీ ఇవ్వరాదని నిర్ణయించడం, రాష్ట్రాల పైన ఆంక్షలు విధించడం రాబోయే కాలంలో పెను ప్రమాదానికి దారి తీయవచ్చు . ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టాన్ని 11 రాష్ట్రాలు 500 పై రైతు సంఘాలు వ్య తిరేకించినట్లుగా తెలుస్తుంది. విద్యుత్ రంగము ప్రైవేటు పరమైతే పెట్టుబడిదారులకు వరం కాగా ప్రజలకు శాపంగా పరిణమించే అవకాశం ఉన్నది. చిన్న తరహా పరిశ్రమలు వ్యవసాయ రంగము తాగునీటి పథకాలు వృత్తి పనివారు సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉన్నది . రా బోయే ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000 సంవత్సరంలో ఆగస్టు 28న సాగిన పోరాటం మాదిరిగా మరొక్క మారు దేశవ్యాప్తంగా ప్రజలు పోరాటానికి సిద్ధమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచగలిగితేనే విద్యుత్ శక్తి ప్రజలకు అందుబాటులో ఉంటుంది. లేకుంటే ఇష్టారాజ్యంగా చార్జీలను పెంచుతూనే ఉంటారు ప్రైవేట్ పరం చేయడంతో సంక్షేమం మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. రానున్న ప్రమాదానికి సమైక్యంగా ఎదుర్కోవడానికి 28 ఆగస్టు బషీర్బాగ్ సంఘటన మనకు స్ఫూర్తివంతంగా ప్రేరణగా పనిచేయాలని సమైక్య ఉద్యమాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆలోచింప చేయడానికి ఇదే అదునుగా భావించి రాబోయే ఎన్నికల్లో క్రియాశీలక నిర్ణయం తీసుకోవాలని ప్రజాస్వామిక వాదులు ప్రజా సంఘాలు ప్రజలకు పిలిపిస్తున్నవి.
(ఈ వ్యాసకర్త సా.రా.విశ్లేషకులు. ఉపాధ్యాయ ఉద్యమనేత హుస్నాబాద్. జి.సిద్దిపేట తెలంగాణ)