ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గారు....

Jul 22, 2024 - 20:16
 0  3
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గారు....
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గారు....

 కళకళలాడుతున్న జూరాల ప్రాజెక్టు.... 

ఈరోజు గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటి ప్రవాహాన్ని ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు పరిశీలించడం జరిగినది. 


  ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ....

గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో సకాలంలో వర్షాలు పడడంతో కర్ణాటక ప్రాంతంలోని ఆల్మట్టి నారాయణపూర్ డ్యాం, కర్ణాటక మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు రావడంతో 1లక్ష 50 వేలపైన క్యూసెక్కులు నీటి నిల్వ  రావడంతో  నిండిపోవడంతో జూరాల ప్రాజెక్టు నీటి ప్రవాహం పెరిగినది. ఇప్పటికే 30కు పైగా గేటుల ను తెరవడం జరిగింది. అదేవిధంగా పవర్ జనరేట్ ని కూడా నాలుగు యూనిట్లు స్టార్ట్ కావడం జరిగినదని తెలిపారు.

  ప్రతి ఒక రైతు ముఖంలో సంతోషం కండల్లో కనిపిస్తుంది. వ్యవసాయము పనులు ప్రారంభించి నాట్లు వేయడం జరుగుతుంది. గత సంవత్సరం సరైన వర్షాపాతం లేక రైతులు కొంత ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు వర్షాలు కురవడం వల్ల డ్యాములు నీళ్లు రావడంతో నది , రిజర్వాయర్, కాల్వలు చెరువులో నీళ్లతో జలమయంతో నిండుగా కాబోతుంది దీనితో రైతులకు చివరి ఆయకట్టు వరకు నీటిని అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.

  సీఎం రేవంత్ రెడ్డి గారి సహకారంతో రైతులకు నీటిని విడుదల చేసుకోవడం జరిగింది. రైతులకు వ్యవసాయానికి ఉపయోగపడే ఫర్టిలైజర్ కూడా నిలువ ఉంచడం జరిగిందని పేర్కొన్నారు . అదేవిధంగా రైతు రుణమాఫీ లక్ష రూపాయలు కావడంతో రైతులకు ఎంతో సంతోషంగా ఉన్నది. రైతుల అభివృద్ధి కోసం  కృషి చేస్తున్న దేశంలోని తెలంగాణ రైతాంగం అగ్రస్థానంలో నిలిచే విధంగా ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. 


 ???? ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అజయ్ ఉరుకుందు, హనుమంతు, ప్రభాకర్ గౌడ్ కురుమన్న, ఈశ్వర్ , ప్రవీణ్ , రైతులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333