ఐకెపి సెంటర్లను వెంటనే ప్రారంభించాలి ..

సన్న రకం ధాన్యానికి బొనస్ 500 రూపాయలు ఇవ్వాలి ..

Nov 5, 2024 - 19:40
Nov 5, 2024 - 19:45
 0  9
ఐకెపి సెంటర్లను వెంటనే ప్రారంభించాలి ..

తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా  ఐకెపి సెంటర్లను ప్రారంభించి ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడుపంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు...

మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
 పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ ఇప్పటికే రైతులు పండించిన పంట చేతికి వచ్చిన కానీ సరైన మార్కేట్ సౌఖర్యం లేక పోవడం వల్ల పొలాల మధ్యనే ధాన్యం ఆరబోసి కోని ఎదురు చూస్తున్నారనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు... ఈ సీజన్ లో అకాల వర్షాలు రావడం తో వరి పంట దిగుబడి తగ్గిందని పెట్టిన పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి వుందన్నారు..

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజలకు సౌఖ దుఃఖానాల ద్వారా సన్న బియ్యం ఇస్తామని చెప్పడంతో పాటు సన్న వడ్లు పండించిన వారికి 
క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానని హామీ ఇవ్వడంతో రైతాంగం సన్న వడ్లు ఎక్కువగా పండించారని అందుకొరకు బోనస్ ఐదు వందల రూపాయలు వెంటనే ఇవ్వాలని పంతంగి వీరస్వామి గౌడ్ కోరారు...
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఋణ మాఫీ చేస్తామని వాగ్దానం చేశారని కానీ 18 వేల కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారని పంతంగి వీరస్వామి గౌడ్ విమర్శించారు...
రైతు భరోసా కింద ఎకరాకు ఐదు వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పకుండా అమలు చేయాలని  ఈ కార్యక్రమంలో సూర్యాపేట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి మండదీ గోవర్ధన్ గౌడ్ పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ పట్టణ కార్యదర్శి అయితే గాని మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ పట్టేటి కిరణ్ రాపర్తి జానయ్య తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333