అతివేగం ప్రమాదకరం ఎమ్మెల్యే మందుల సామెల్

తిరుమలగిరి 30 జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
అతివేగం ప్రమాదకరం నిర్లక్ష్యం వహించదు హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ సూర్యాపేట జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లో జాతీయ రోడ్డు భద్రత అవగాహన సదస్సు లో ముఖ్య అతిథిగా విచ్చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ అతివేగం ప్రమాదకరం ప్రయాణించే వాహన దారులు హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలి ఇంటిదగ్గర మీకోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటారు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలు దీనస్థితిలో ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీవో సురేష్ రెడ్డి ప్రకాష్ రెడ్డి ఎంఈఓ శాంతయ్య మండల పార్టీ అధ్యక్షులు నరేష్ సుంకర జనార్ధన్ దామర శ్రీనివాస్ ఆంటోనీ మరియు ఆటో లారీ డ్రైవర్లు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు