ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా ""గణతంత్ర దినోత్సవ వేడుకలు

Jan 26, 2025 - 17:54
Jan 26, 2025 - 19:48
 0  25
ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా ""గణతంత్ర దినోత్సవ వేడుకలు

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ :

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 

కోదాడ జనవరి 26,న్యూస్ ఇండియా రిపోర్టర్ మాదారపు శ్రీనివాస్ : డీజీఎం లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా సురేష్ మాట్లాడుతూ దేశభక్తి పిల్లలకు అలవర్చటం ఎంతో అవసరం అన్నారు. ప్రతి ఒక్కరు దేశం కొరకు పాటుపడాలన్నారు. ప్రిన్సిపల్ పుల్లయ్య జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చే బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State