రామాపురం జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో షీ టీమ్స్ అవగాహన కార్యక్రమం
జోగులాంబ గద్వాల 15 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : వడ్డేపల్లి మహిళల రక్షణ, భద్రత పరంగా ఎస్పీ శ్రీ టి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు చేపడుతున్న షీ టీమ్స్ అవగాహన కార్యక్రమం ఈరోజు రామాపురం గ్రామంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ ఇన్‌ఛార్జ్ తేజస్విని ఎస్‌ఐ మరియు షీ టీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడుతూ తేజస్విని ఎస్‌ఐ ఇలా అన్నారు విద్యార్థినిలు ఎలాంటి వేదింపులు ఎదుర్కొన్న నిస్సంకోచంగా పోలీసులను సంప్రదించాలి.పోలీస్ శాఖ మహిళా సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. షీ టీమ్స్ దరఖాస్తులు, ఫిర్యాదులను గోప్యంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుంది" అన్నారు.
విద్యార్థిని విద్యార్థులకు ఈవ్ టీజింగ్, ఆన్‌లైన్ హరాస్‌మెంట్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్,బాల్య వివాహాలపై చట్టపరమైన అవగాహన కల్పించబడింది. అలాగే మహిళలు, బాలికలు సురక్షితంగా ఉండుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం జరిగింది.
షీ టీమ్స్ హెల్ప్ లైన్ నెంబర్: 8712670312, డయల్ 100, మరియు WhatsApp ద్వారా ఫిర్యాదుల నమోదు విధానం గురించి వివరించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ సిబ్బంది, స్కూల్ ప్రధానోపాధ్యాయులు వి.నరసింహులు , అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.