ఎరువుల గోదామును ఆకస్మిక తనిఖీ చేసిన తహసిల్దార్

తిరుమలగిరి 20 ఆగస్టు 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుమలగిరి పట్టణం లోని మన గ్రోమోర్ ఎరువుల గోదామును ఆకస్మికంగా తనిఖీ చేసిన తహసీల్దార్ భాశెట్టి హరిప్రసాద్ , ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన గ్రోమోర్ గోదాములో ప్రస్తుతం 348 బస్తాలు యూరియా అందుబాటులో వుంది, బ్లాక్ మార్కెట్ గాని ఎక్కువ ధరకు విక్రయించిన చెట్టరీత్య చర్యలు తీసుకుంటామని అలాగే రైతులను ఇలాంటి ఇబ్బందులు పెట్టినచో కఠిన చర్యలు తీసుబడు నని హెచ్చరించారు వారి వెంట ఎంపీడీవో లాజర్ ఏఈఓ వెంకటరెడ్డి ఆర్ ఐ జార్జి రెడ్డి తదితరులు పాల్గొన్నారు