ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న "సంపత్ కుమార్"
వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే : ఏఐసీసీ కార్యదర్శి మాజీ సంపత్ కుమార్.
జోగులాంబ గద్వాల 824 తెలంగాణవార్త ప్రతినిధి:- ఉండవెల్లి. రాబోవు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండల కేంద్రంలో ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ SA సంపత్ కుమార్ ఇంటింటి ప్రచారంలో పాల్గొని గడపగడపను తట్టుతూ పార్లమెంట్ అభ్యర్థి అయిన మల్లు రవి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను వివరించారు.
ఈ సందర్భంగా సంపత్ కుమార్ . మాట్లాడుతూ...నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మల్లు రవి రెండుసార్లు ఎంపీగా కొనసాగి ప్రజల పట్ల ఎంతో అవగాహన ఉన్న పెద్ద మనిషి గనుక తప్పకుండా హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పదేళ్లుగా పాలించిన బిజెపి దేశంలో ఎలాంటి అభివృద్ధి సాధించలేదని కేవలం కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి దేవుని పేరు చెప్పి ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తుందని ,ప్రస్తుతం ఉన్న బిజెపి పార్లమెంట్ అభ్యర్థి వాళ్ళ నాయన ఒక పార్టీలో ఎంపీగా ఉండి మరో పార్టీకి కొడుకు టికెట్ ఇప్పించుకొని కుల మతాల మధ్య విషపూరిత ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని బిజెపి పై ఎద్దేవా చేశారు అదేవిధంగా టిఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనుల పక్షాన నిలబడి అభివృద్ధి సాధిస్తానని చెప్పి ఐదేళ్లుగా అవినీతి పాలన సాగించిన కేసీఆర్ బినామీగా పనిచేసి ప్రస్తుతం బిఆర్ఎస్ లో కొనసాగుతూ మరోసారి అవినీతి పాలనకు పునాదులు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో సాధించిన అభివృద్ధి మరోసారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ,ఉచిత విద్యుత్తును, 500 కే గ్యాస్ సిలిండర్ను ,ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తూ, తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణ అభివృద్ధికి శ్రీకారం చుడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.