పోలే రమాశంకర్ కుటుంబానికి 50వేలు ఆర్థిక సహాయం
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
చండూరు 21 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- నల్గొండ జిల్లా చండూరు మండల పరిధిలో పుల్లెంల గ్రామానికి చెందిన బీవీఫ్ నాయకులు రమా శంకర్ ఇటీవల ప్రమాదవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.వారి కుటుంబానికి భరోసాగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకులతో కలిసి మృతుని కుటుంబాన్ని పరామర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.రమా శంకర్ సేవలను గుర్తుచేస్తూ ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు.చిన్న వయస్సులో మానుండి దూరమవడం జీర్ణించుకోలేక పోతున్నామన్నారు.అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని,పేద కుటుంబంలో పుట్టిన శంకర్ కుటుంబానికి.50వేలు రూపాయల ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు పుదరి సైదులు, శంకరాచారి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.