ఎమ్మెల్యే పై అసత్య ప్రచారం మానుకోండి తస్మాత్ జాగ్రత్త తాటిపాముల గ్రామ శాఖ అధ్యక్షుడు నాయిని కృష్ణ
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేదే లేదు
దళిత ఎమ్మెల్యే ,ఉద్యమకారుడిని చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు
తిరుమలగిరి 11 జూన్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తుంగతుర్తి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు కు రోజురోజుకు పెరుగుతున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉండి కోవర్టు గా బిఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్న వ్యక్తుల పై స్పందించిన తాటిపాముల గ్రామ శాఖ అధ్యక్షుడు నాయని కృష్ణ మాట్లాడుతూ శాలిగౌరారం మండలం లోని వంగమర్తి, ఇటుకుల పాడు మూసి వాగు నుండి ఇసుక ప్రభుత్వం అనుమతితోనే యాదాద్రి ధర్మల్ ప్లాంట్ ఖమ్మం మున్నేరు వాగ్ సేఫ్టీ వాల్ నిర్మాణానికి కావలసిన ఇసుకను తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఇసుక తరలి వెళ్తున్నట్లు స్వయంగా జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన తో మీడియా ముఖ్యంగా ఎమ్మెల్యే మందుల సామెల్ ఫోన్లో మాట్లాడగా వివరణ ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే పై దుష్ప్రచారానికి పూనుకున్న వ్యక్తులు వారి విధివిధానాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడం ఎమ్మెల్యే మందుల సామేలుకు ఇష్టం లేదని చెప్పే దద్దమ్మలకు భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారు, మందుల సామేలుకు నాడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే అదనంగా 20 వేల మెజార్టీ దాదాపు 70 వేల పైచిలుక మెజార్టీని తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే మందుల సామెల్ కు దక్కిందన్నారు అన్నారు