అనాధ ఆశ్రమంలో వృద్ధులకు చీరలు పంపిణీ..

Jun 10, 2024 - 19:58
 0  4
అనాధ ఆశ్రమంలో వృద్ధులకు  చీరలు పంపిణీ..

మునగార 10 జూన్ 2024

తెలంగాణ వార్తా ప్రతినిధి :-

మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఇందిరా వృద్ధాశ్రమంలో సోమవారం మునగాల మండల కేంద్రానికి చెందిన సుంకరి నాగయ్య (కటింగ్ షాప్ స్వామి ) వృద్ధులకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం నాగయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో పేద ప్రజలకు సేవ చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు నాగయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎల్. ఈదయ్య, వృద్ధాశ్రమం నిర్వాకులు విజయమ్మ,తదితరులు హాజరయ్యారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State