ఎన్నికల్లో హామీని నిలబెట్టుకుంటా ఎమ్మెల్యే మందుల సామెల్

Aug 5, 2024 - 21:38
Aug 5, 2024 - 22:22
 0  244
ఎన్నికల్లో హామీని నిలబెట్టుకుంటా ఎమ్మెల్యే మందుల సామెల్

 తుంగతుర్తి లో ఓట్ల కోసం రాజకీయ చేశారు

 విద్యార్థుల భవిష్యత్తుకై తోడుంటా

దశాబ్దాల కళనీ నిజం చేస్తా 

భవనాల పరిశీలన చేసిన ఎమ్మెల్యే

 తిరుమలగిరి 06 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్::- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం సోమవారం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ఎస్సీ మరియు గిరిజన బాలుర వసతి గృహాలు నిరుపయోగంగా ఉందని తెలిసి అట్టి భవనాన్ని కళాశాల ఏర్పాటు కోసం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గెలిచిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు ఉత్తర్వులను ప్రభుత్వం ద్వారా ఆమోదింప చేసి ఈ ప్రాంత విద్యార్థుల సుదీర్ఘ కలను నెరవేర్చానని అన్నారు. ఎప్పుడో ఏర్పాటు కావలసిన కళాశాలను కొందరి నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం మభ్యపెట్టి ఇన్నాళ్లు ఓట్లు దండుకొని రాజకీయాలు చేశారే తప్ప తమ చిత్తశుద్ధిని చాటుకోలేదన్నారు.ఈ ప్రాంత బిడ్డను కాబట్టే ఇక్కడి సమస్యలు నాకంటే ఎవరికీ ఎక్కువ తెలియదని తెలిపారు వెంటనే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది తొందరగా జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు.ఆయనతోపాటు ఇంటర్మీడియట్ బోర్డు డిడి లక్ష్మారెడ్డి,డిఐ ఈ ఓ కృష్ణయ్య,జూనియర్ డైరెక్టర్ నరసింహ, సునీత్ కుమార్ తాత్కాలిక కళాశాల భవనాన్ని పరిశీలించారు.తిరుమలగిరి మున్సిపాలిటీ చైర్ పర్సన్ చాగంటి అనసూయ రాములు,మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వై నరేష్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మూల అశోక్ రెడ్డి,పాలకుర్తి రాజయ్య,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దరావత్ జిమ్మి లాల్,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మూల రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు సుంకరి జనార్ధన్ మీడియా ఇన్ఛార్జి కందుకూరి లక్ష్మయ్య,పేరాల వీరేష్,పత్తేపురం సుధాకర్,దాచేపల్లి వెంకన్న,బత్తుల శ్రీను,వీరమల్లు గౌడ్, గిలకత్తుల రాము గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034