ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మందుల సామెల్

Aug 5, 2024 - 21:51
Aug 5, 2024 - 22:19
 0  244
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మందుల సామెల్

తిరుమలగిరి 06 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్ తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం శాసనసభ్యులు మందుల సామేల్ ముఖ్యమంత్రి సహాయనిది పథక0 కింద పలువురికి మంజూరైన ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేద ప్రజలకు వరం లాంటిదని ఈ పథకం కింద నిరుపేదలైన వారికి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం మంజూరు చేశామని ఆయన అన్నారు దీంతో నిరుపేద ప్రజలు తమ ఆరోగ్యాలను కాపాడుకోవచ్చునని చెప్పారు దారిద్ర రేఖకు దిగువగా ఉండి ఆసుపత్రిలో ఖరీదైన వైద్యం చేయించుకోలేని వారికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు, ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపాలిటీ చైర్ పర్సన్ చాగంటి అనసూయ రాములు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వై నరేష్, పట్టణ అధ్యక్షులు పేరాల వీరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాలకుర్తి రాజయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దరావత్ జుమ్మి లాల్ నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు సుంకరి జనార్ధన్ మీడియా ఇన్ఛార్జి కందుకూరి లక్ష్మయ్య ,పేరాల వీరేష్ పత్తేపురం సుధాకర్ ,దాచేపల్లి వెంకన్న, బత్తుల శ్రీను తదితరులు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034