ఎండిపోయిన పంట పొలాలకు 30000 నష్టపరిహారం చెల్లించాలని CP(IM) డిమాండ్

Mar 18, 2025 - 20:07
 0  15
ఎండిపోయిన పంట పొలాలకు 30000 నష్టపరిహారం చెల్లించాలని CP(IM) డిమాండ్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ పంట ఎండిపోయిపంట ఎండిపోయిన, నష్టపోయిన రైతులకు ఎకరాకు 30000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని .CPI[M] జిల్లా కమిటీ సభ్యులు దండా వెంకటరెడ్డి మండల కార్యదర్శి ఆవిరె అప్పయ్య లు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలో తహసిల్దార్ గారి కార్యాలయం ముందు రిలే దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందించాలి రైతులందరికీ రైతు భరోసానివ్వాలి అర్హులందరికీ రుణమాఫీ పూర్తి చేయాలి వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అందించాలని ఇల్లు లేని నిరుపేదలకు పక్క గృహాలను కటించాలని వారన్నారు. వానకాలం వరి బోనస్ కింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి యాసంగి పంట చేతికి వచ్చేదాకా కూడా బోనస్ అందించకుండా కాలయాపన చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని వారు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాలన వస్తవ్యస్తంగా ఉందని ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక కార్యాలయంలోని ఆర్ఐ గారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు సానబోయిన ఉపేందర్ సోమిరెడ్డి దామోదర్ రెడ్డి దండ శ్రీనివాస్ రెడ్డి రాచకొండ సైదులు గోలి భాగ్యమ్మ బొప్పని కనకమ్మ ఎరుకల నాగరాజు యాతాకుల మల్లయ్య నవిల లింగయ్య సైదులు తదితరులు పాల్గొన్నారు.