జాతీయ నులిపురుగుల నిర్మూలన దినము పై అవగాహన కార్యక్రమం.

Feb 4, 2025 - 14:56
Feb 4, 2025 - 15:14
 0  2
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినము పై అవగాహన కార్యక్రమం.

డిఎంహెచ్వో డాక్టర్ సిద్ధప్ప.

జోగులాంబ గద్వాల 4 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి. గద్వాల.  జిల్లా కేంద్రంలోని  తేదీ 04.02.2025 న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో"" జాతీయ నులిపురుగుల నిర్మూలన దినము -2025 గురించి వైద్యాధికారులకు, మరియు వైద్య సిబ్బందికి అవగాహన కార్యక్రమము నిర్వహించడం జరిగింది..

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారి డాక్టర్ ఎస్ కే సిద్ధప్ప,మాట్లాడుతూ.తేదీ.10.2.2025 న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీ, అంగన్వాడి సెంటర్లో, 1- 19 సంవత్సరంల పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్, వైద్య సిబ్బంది, మరియు టీచర్లు, అంగన్వాడి సిబ్బంది మింగిస్తారని తెలిపారు..  తేదీ 10.2.2025 న అనివార్య కారణాలవల్ల విద్యార్థులు ఆల్బెండజోలో మాత్ర వేసుకోకపోతే తేదీ. 17.2.2025 న ( మాపప్ రౌండ్ ) న టాబ్లెట్ వేస్తారని తెలిపారు.. 1 - 2 సంవత్సరంల పిల్లలకు సగము ఆల్బెండజోల్ మాత్ర పొడిచేసి నీళ్లలో కలిపి త్రాగించాలని, అదేవిధంగా 2 - 3 సంవత్సరంలోపు పిల్లలకు 1 ( ఒకటి) ఆల్బెండజోల్ మాత్ర పొడిచేసి నీళ్లలో  కలిపి త్రాగించాలని  మరియు 3 - 19 సంవత్సరాల లోపు పిల్లలకు 1 ( ఒకటి) ఆల్బెండజోల్ మాత్ర చప్పరించి, నమిలి, మింగమని, సూచించాలని  వైద్య సిబ్బందికి తెలిపారు.

విద్యార్థులలో ఎవరికైనా నులిపురుగుల సంక్రమణ ఉన్నట్లయితే వారికి, రక్తహీనత,, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత మరియు ఆందోళన, కడుపునొప్పి, వికారము, వాంతులు, అతిసారము, మరియు బరువు తక్కువ ఉండడం  ఒంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు.. విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్ర మింగించడం వల్ల, రక్తహీనతను నియంత్రిస్తుంది, మరియు పోషకాహార ఉపయోగితను మెరుగుపరుస్తుంది, అంతేకాకుండా ఏకాగ్రతను, నేర్చుకోగల సామర్థ్యం, హాజరు శాతం మెరుగుపరుస్తుంది, మరియు పర్యావరణంలో నులిపురుగుల సంక్రమణ వ్యాప్తిని నిరోధిస్తుంది.. ఈ అవగాహన కార్యక్రమంలో, ప్రోగ్రామ్ ఆఫీసర్లు , డాక్టర్. తన్వీర్  రిజ్వానా (జిల్లా ఇమ్నైజేషన్  అధికారి) మరియు డాక్టర్ . ప్రసూన రాణి  (జిల్లా మాత శిశు సంరక్షణ అధికారి), డాక్టర్ రాజు, ప్రోగ్రాం ఆఫీసర్  (NCVBDC), మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది, కే.మధుసూదన్ రెడ్డి, j తిరుమలేష్ రెడ్డి,టీ. వరలక్ష్మి, మరియు వివిధ ప్రాథమిక కేంద్రం ల వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, మరియు ఆర్ బి ఎస్ కే ప్రోగ్రాం వైద్య సిబ్బంది పాల్గొన్నారు..

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State