తెలుగుదేశం 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుక

Mar 29, 2025 - 22:19
 0  6
తెలుగుదేశం 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుక

చర్ల 29-03-2025

ఈరోజు చర్ల మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కొత్తపల్లి రామాంజనేయులు గారు పార్టీ సీనియర్ నాయకులు మరియు సొసైటీ మాజీ వైస్ చైర్మన్ కాకర్ల సుందరం గారి చేతుల మీదుగా పార్టీ జెండ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా టీడీపీ జిల్లా నాయకులు మరియు రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ *సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు* నినాదనంతో ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ అని పేదవాడి కష్టంలో నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలుగుజాతి సంక్షోభంలో వున్న ప్రతిసారి వారికి వెలుగునిచ్చేది తెలుగుదేశం పార్టీ అని రెండూరుపాయలకు కిలో బియ్యం అందించిన ఘనత టీడీపీ పార్టీకి చెందుతుంది అని రానున్న ఆ

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలో పోటీచేసి తద్వారా పార్టీ తెలంగాణాలో కూడా సత్తా చాటుతం అని తెలియచేశారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు ఎడ్ల సత్తిబాబు రేగల్ల సుధాకర్ నల్లూరు మురళీ ఏడారి సత్యరణయన చిన్నబాబు బాసిబోయిన నాగేశ్వర్రావు జెట్టి నరసింహమూర్తి నడింపల్లి రమేష్ చంటి బేత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు