ఉపాధి కూలీల శ్రమను దోపిడీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వ్య.కా.సం నేత ధనుంజయ నాయుడు ఆరోపణ

ఉపాధి కూలీల శ్రమలు కేంద్ర ప్రభుత్వం దోపిడీ చేస్తున్నది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ఆరోపించారు. శనివారం నాడు ఆయన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు లో ఉపాధి కూలీ లు పనిచేస్తున్న ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం ఆయనమాట్లాడుతూ.... భయంకరమైన భగభగ ఎండలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు కొలతతో సంబంధం లేకుండా 700 రూపాయలు ఇవ్వాలని( బి కే ఎం యు) అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈ సంవత్సరం కేవలం 7 రూపాయలు పెంచి చేతులు దులుపుకున్నారని 700 రూపాయలు డిమాండ్ చేస్తే ₹7 పెంచడంఏమిటి అని ఆయన ధ్వజం ఎత్తారు. నిత్యజీవితావసర వస్తువుల ధరలను కట్టడి చేయలేని కేంద్ర ప్రభుత్వం.... రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించలేని ప్రభుత్వం తప్పుడు సర్వే చేయించి దేశంలో నరేంద్ర మోడీ నెంబర్ వన్ గా కీర్తించబడటాన్ని ఆయన అపహాస్యం చేశారు ఉపాధి కూలీ కూడా రాష్ట్రానికో తీరుగా చెల్లిస్తున్నారని హర్యానాలో 400 రూపాయలు ఉండగా తెలంగాణలో ఏపీలో కేవలం 307 రూపాయలుమాత్రమే ఇస్తున్నారని, ఒకే దేశం,, ఒకే ప్రజ,,ఒకే చట్టo అని ఒక దంపుడు మాటలు చెబుతున్న బిజెపి వారు ఉపాధ కూలీలకు చెల్లిస్తున్న వేతనం రాష్ట్రానికో తీరుగా ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటు సభ్యులకు,, ఇష్టం వచ్చిన రీతిగా జీతాలు పెంచుకుంటూ విలాసవంతమైన భవనాల్లో నివసిస్తున్నారని లగ్జరీ కార్లలో ప్రయాణిస్తున్నారని నెలకు 350 రూపాయలు చెల్లిస్తే నెల అంతా ఉచిత ఫోన్ కాల్ సౌకర్యం ఉన్నప్పటికీ నెలకు పదివేల రూపాయల ఫోన్ బిల్లు లను ప్రభుత్వం ప్రజా ప్రతినిధులకు అప్పనంగా ప్రజల సొమ్మును దోచిపెడుతున్నారని, ఈ దేశంలో అత్యంత పేద వర్గాలైన ఉపాధి కూలీలకు మాత్రం సంవత్సరానికి 7 రూపాయలు కూలి పెంచి ఏదో దేశాన్ని ఉద్దరిస్తున్నట్టుగా ఫోజులు పెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. కొలతలతో సంబంధం లేకుండా ఉపాధి కూలీలకు రోజుకు 700 రూపాయల వేతనంతో పాటు సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలనిఆయన కోరారు ఆయుధ ఏఐఎస్ఎఫ్ నాయకుడు కొమర్రాజు వెంకట్, బెక్కం నాగయ్య పిట్టల సైదులు పిట్టల మట్టమ్మ బేక్కం రత్తమ్మ పర్సన బోయిన ముత్యాలమ్మఉన్నారు