ఇండెల్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ లో భారీ కుంభకోణం

Jul 13, 2024 - 19:32
Jul 13, 2024 - 19:40
 0  4

వినియోగదారుల లోన్ పై అధిక వడ్డీకి మరో లోన్ తీసుకున్న మేనేజర్

గోల్డ్ లోన్ తీసుకున్నది 18 లక్షలు వడ్డీతో 30 లక్షలకు చేరిన వైనం

వడ్డీ మితిమీరి వేలానికి వచ్చిన బంగారం లబో దీబో అంటున్న బాధితులు

విచారణ చేసి న్యాయం చేయాలంటున్న భాదితులు 

అత్యవసరాల నిమిత్తం తమ ఇంట్లోని బంగారాన్ని కుదువ పెట్టు లోన్  తీసుకుంటున్న వినియోగదారులు భారీగా మోసపోతున్నారన్నడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల అవసరాలను వారి బలహీనతను ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థలు భారీ కుంభకోణాలకు పాల్పడుతూ వినియోగదారుల నోట్లో మట్టి కొడుతున్నాయి.  అలాంటి సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తల్లి విగ్రహం వద్ద ఉన్న ఇండల్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ లో శనివారం వెలుగులోకి వచ్చింది. సూర్యాపేటకు చెందిన బాధితుడు బుర్ర శ్రీనివాస్ సరస్వతి దంపతులు 15 నెలల క్రితం బ్యాంకులో బంగారాన్ని తాకట్టుపెట్టి 18 లక్షల రూపాయలను 1.10 పైసల వడ్డీకి లోను తీసుకున్నారు.  అనంతరం ఈ విషయం వారికి తెలియకుండా సదరు గోల్డ్ లోన్ సంస్థ మేనేజర్ సంస్థలో ఉన్న నిబంధనలు తెలుసుకొని పెట్టిన బంగారంపై అధిక వడ్డీకి మరికొంత డబ్బు తీసుకోవచ్చని రూ 2.50 పైసల వడ్డీకి మరో రెండు లక్షల రూపాయలను వియోగదారులకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో తీసుకోవడం జరిగింది.  ఇటీవల బాధితులకు బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున డబ్బు కట్టాల్సి ఉందని డబ్బు వెంటనే కట్టాలని లేని పక్షంలో తమ బంగారం వేలానికి వెళుతుందని చెప్పడంతో హుటాహుటిన హైదరాబాదులో ఉన్న బాధితులు సూర్యాపేటలోని గోల్డ్ లోన్ సంస్థ కార్యాలయానికి వచ్చారు. అక్కడ వారికి తెలిసిన విషయాలతో కంగుతిన్నారు. గోల్డ్ లోన్ సంస్థ మేనేజర్ తమ ఫోర్జరీ సంతకాలతో అధిక వడ్డీతో అధిక డబ్బు తీసుకోవడంతోనే 30 లక్షల వరకు లోన్ పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము తీసుకున్న 18 లక్షలు కాకుండా గోల్డ్ లోన్ సంస్థ మేనేజర్ తీసుకున్న 2 లక్షలతో మొత్తం 15 నెలలకు తొమ్మిది లక్షల వడ్డీ అయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.  బంగారం సెంటిమెంటు కావడంతో చేసేదేమీ లేక మరింత అధిక వడ్డీకి లోను రెన్యువల్ చేసుకొని 7 లక్షల రూపాయలు చెల్లించామని అన్నారు. మరో మూడు లక్షలు చెల్లించాల్సి ఉందని అది చెల్లించకుంటే బంగారం వేలానికి పోతుందని బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. మాకు తెలియకుండా మా రుణంపై అధిక వడ్డీకి మరో రుణం తీసుకున్న గోల్డ్ లోన్ సంస్థ మేనేజర్ పై తగిన విచారణ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై సంస్థ జోనల్ మేనేజర్, ఏరియా మేనేజర్ లు సూర్యాపేట సంస్థ మేనేజర్ ఫోర్జరీ సంతకాలు చేసింది వాస్తవమేనని అంగీకరించారని ఆమెపై చర్యలు తీసుకుంటామని అంటున్నారే తప్ప మా డబ్బు ఇస్తామని చెప్పడం లేదని అన్నారు. మా డబ్బు మాకు ఇవ్వాలని మేనేజర్ ను ప్రశ్నించగా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా సంస్థ నుంచి పారిపోయారని తెలిపారు.  ఒకవేళ ఏ తప్పు చేయకుంటే ధైర్యంగా మాకు సమాధానం చెప్పి ఉండేవారని అన్నారు. వీరు ఒకరే కాకుండా మరికొందారు బాధితులు సంధ్య,  అన్నపూర్ణలు మాట్లాడుతూ ఈ సంస్థలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని అనేక మంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని  అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విడతలవారీగా తీసుకున్న లోన్లకు విడుతలవారీగా డబ్బు చెల్లిస్తామంటే ఒప్పుకోవడం లేదని అన్ని కలిపి కడితేనే బంగారం బయటకు పంపిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈ విషయమై ఉన్నత అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333