చార్లెట్ చారిటబుల్ ఫౌండేషన్ జాటోత్ డేవిడ్ రాజు ఆధ్వర్యంలో

Mar 20, 2025 - 18:48
 0  1
చార్లెట్ చారిటబుల్ ఫౌండేషన్ జాటోత్ డేవిడ్ రాజు ఆధ్వర్యంలో
చార్లెట్ చారిటబుల్ ఫౌండేషన్ జాటోత్ డేవిడ్ రాజు ఆధ్వర్యంలో

పదవ తరగతి విద్యార్థులకు ఫ్యాడ్స్, పెన్నులు, కంపాక్స్ లు పంపిణి

ముఖ్య అతిధిగా సబ్ ఇన్స్పెక్టర్ బి. ప్రవీణ్ కుమార్ మునగాల

గురువారం 20 మార్చి : స్థానిక మునగాల మండల కేంద్రం లోని ట్రినీటి ఇంగ్లిష్ మీడియాం హై స్కూల్ విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు, కంపాక్స్ భాక్స్ లు చార్లేట్ చారిటబుల్ ఫౌండేషన్ సూర్యాపేట సంస్థ వ్యవస్థాపక అద్యక్షులు జాటోతు డేవిడ్ రాజు, జనరల్ సెక్రటరీ జాటోతు శేఖర్ ల  ద్వారా అందించగా ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధి గా మునగాల  సబ్ - ఇన్స్పెక్టర్ బి. ప్రవీణ్ కుమార్ పాల్గొని వారి చేతుల మీదుగా పదవ తరగతి విద్యార్థిని, విద్యార్ధులకు ప్యాడ్లు, పేన్నులు ,జామెంట్రీ బాక్స్ లు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్ధులు సెల్ ఫోన్లు ఎక్కువ గా వాడటం ద్వారా సైబర్ నేరాలకు గురి కావాల్సి వస్తుందని,పదవ తరగతి వరకు ఫోన్లు అతిగా వాడకుండా అవసరము మేరకే వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం ఏ.ఎ.స్సై శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ డయాల్ నెం. 100 మరియు సైబర్ నెం 1930 నెంబర్లను ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకొని అవసరమున్న మేరకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం చార్లేట్ చారిటబుల్ పౌడేషన్ అద్యక్షులు డేవిడ్ రాజు మాట్లాడుతూ సెల్ పోన్ కంటే పుస్తకము భవిషత్ ను తీర్చి దిద్దుతుందని, మీరు బాగా పరీక్షలు రాసి ఉన్నతమైన మార్కులు సంపాదించి తల్లి తండ్రులకు, స్కూల్ కు మంచి పేరు తేవాలని, మీ భౌవిషత్ కు పదవ తరగతి మార్కులు చాలా ఉపయోగ పడతాయాన్ని అన్నారు.ఈ కార్యక్రమం లో జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్. ఎన్. హెచ్. ఆర్. ఎఫ్) మీడియా కన్వీనర్ దుర్గం ప్రభాకర్, పాఠశాల అధినేత శ్రీమతి జానకీ వనజ, ప్రిన్సిపాల్ ముల్లంగి జాకబ్ రాజు  ఉపాద్యాయ బృందం, ఏర్పుల క్రిస్టోఫర్, జిల్లపెల్లి సైదులు తదితరులు పాల్గోన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333