దేశాభివృద్ధిలో విద్యార్థులదే కీలక పాత్ర

చర్ల,జనవరి 9 దేశాభివృద్దిలో విద్యార్దులదే కీలకపాత్ర అని దత్తసాయి మందిరం అర్చకులు పున్నమరాజు విజయకుమార్ శర్మ అన్నారు. సంక్రాంతి పర్వదినం, పున్నమరాజు నారాయణరావు - కమల దంపతుల జ్ఞాపకార్థం విజయకుమార్ శర్మ - లలిత దంపతులు చర్లలోని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయ విద్యార్దులకు నూతన దుస్తులను పంపిణీ చేసారు. గురువారం వారం జరిగిన కార్యక్రమంలో విద్యార్దులకు వారు దుస్తులను అందచేసారు. ఈ సందర్భంగా విజయకుమార్ శర్మ మాట్లాడుతూ విద్యార్దులు చదువుకున్నప్పుడే దేశం శాస్త్రసాంకేతిక రంగంలో దూసుకు వెలుతుందన్నారు. చదువు ద్వారానే విజ్ఞానం వస్తుందని, ప్రతి విద్యార్ది కష్డపడి చదవాలని విజ్ఞప్తి చేసారు. క్రమశిక్షణకు మారుపేరయిన వనవాసీ విద్యార్దులు చదువులతో నిలయ ప్రతిష్టను ఇనుమడింప చేయాలని కోరారు. కార్యక్రమంలో వనవాసీ ప్రాంత మహిళా సహ ప్రముఖ్ పెద్దాడ ఆశాలత, ప్రచండ ప్రముఖ్ గొంది శోభన్‌బాబు, నిలయ ఉపాద్యక్షులు జవ్వాది మురళీకృష్ణ, సహ కార్యదర్శి గోగికార్ రాంలక్ష్మణ్, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి, విజయకుమార్ కుమాడుడు కార్తికేయ శర్మ, కుమార్తె శ్యామల పాల్గొన్నారు.