ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం..

Feb 14, 2025 - 20:55
Feb 14, 2025 - 21:03
 0  23
ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం..
ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం..

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్నూరి నరేందర్ రెడ్డి

కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు.

కోరుట్ల, 14 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- కోరుట్ల పట్టణ జిఎస్ గార్డెన్లో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాక సమావేశం నిర్వహించారు ఈసమావేశానికి ముఖ్యఅతిథిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్నూరి నరేందర్ రెడ్డి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు లు విచ్చేశారు ఈసందర్బంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన పది నెలల లోపే 56 వేల ఉద్యోగాలను కల్పించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉందని ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు రావడం సంతోషమన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన పది నెలల లోపు కరీంనగర్లో ఇంజనీరింగ్ కాలేజ్ లా కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని రాబోయే నెల రోజుల్లోపు ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డి ఏ లను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ప్రతిపక్షాలు నరేందర్ రెడ్డి పై అసత్యపు ప్రచారాలు చేస్తున్నాయని వాటిని తిప్పి కొట్టే విధంగా కృషి చేయాలన్నారు గత 24 సంవత్సరాలుగా 12,000 మంది పండిత ఉద్యోగులు ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రమోషన్లు కల్పించిందన్నారు

 గతంలో కరీంనగర్లో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆ కోచింగ్ కు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉచిత సౌకర్యం ద్వారా కామారెడ్డి నిర్మల్ నుండి ఎంతోమంది మహిళలు వచ్చి ఉచిత కోచింగ్ లో సద్వినియోగం చేసుకున్నారన్నారు త్వరలోనే ప్రైవేటు పాఠశాలలకు ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల అయ్యేవిధంగా కృషి చేస్తానన్నారు తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే లైబ్రరీలో డిజిటల్ విధానాన్ని అమలుపరుస్తూ మధ్యన భోజనాన్ని ఏర్పాటు చేస్తానన్నారు అంతేకాకుండా మహిళలకు యువకులకు వేరువేరుగా గదులు ఏర్పాటు చేస్తామన్నారు అనంతరం జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం పని చేస్తున్న ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుంటే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని కావున రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు  ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే కోరుట్ల నియోజకవర్గానికి అధికమైన నిధులు మంజూరు చేయించుకొని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు కావున ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు

గత ఉమ్మడి రాష్ట్రంలో ఆల్ ఫోర్స్ కళాశాల వల్ల తెలంగాణలో నారాయణ చైతన్య లాంటి కళాశాలలో రాకుండా నరేందర్ రెడ్డి అడ్డుకట్ట వేశారన్నారు నరేందర్ రెడ్డి పై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ సరైన సమాధానం చెప్పాలన్నారు అనంతరం జువ్వాది కృష్ణారావు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో సుమారు 9వేల పట్టబద్రుల ఓట్లు ఉన్నాయని కావున కాంగ్రెస్ పార్టీ నేతలు ఐదుగురు సభ్యులుగా ఏర్పడి ప్రతి పట్టభద్రున్ని తట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించే విధంగా కృషి చేయాలన్నారు గత 67 సంవత్సరాలు పాలించిన పాలకులు 67 లక్షల అప్పులు చేస్తే కల్వకుంట్ల కుటుంబం గడిచిన 10 సంవత్సరాలలో 7000 కోట్ల అప్పులు చేసిందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు కృషి చేస్తుందన్నారు ఈకార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ముట్నూరి నరేందర్ రెడ్డి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గౌడ్  పట్టణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మచ్చ కవిత పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్  సిపిఐ నాయకులు చెన్నా విశ్వనాథం కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కోఆప్షన్ సభ్యులు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333