ఆర్యవైశ్య ఆధ్వర్యంలో బెలిదె శ్రీనివాస్ కు ఘనంగా సన్మానం

Jun 26, 2026 - 21:53
 0  4
ఆర్యవైశ్య ఆధ్వర్యంలో బెలిదె శ్రీనివాస్ కు ఘనంగా సన్మానం

తిరుమలగిరి 27 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

ఇటీవల జరిగిన సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలుపొందిన బెలిదె శ్రీనివాసులు ని తిరుమలగిరి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తాటిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో గురువారం తిరుమలగిరి మండలకేంద్రంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సూర్యాపేటలో ఆర్యవైశ్యులకు బెలిదె శ్రీనివాసులు చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అనంతరం మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుమర్తి సత్యనారాయణ, దామెర ఉపేందర్, ఇమ్మడి యాదగిరి, బుక్క సత్యనారాయణ, ఎర్రం వెంకన్న, హాయగ్రీవమూర్తి, దారం వెంకన్న, రేపాక సోమేష్ తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి