నీరు లేక బహిరంగ వినాయక విగ్రహాలు
జోగులాంబ గద్వాల 24 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల . మండలంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి అనుసంధాన కాలువలో నీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. మొగలి రావులచెరువు వేముల గ్రామాల రైతులు సమస్యను అధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు. వినాయక నిమజ్జనానికి నీరు అందుబాటులో లేక విగ్రహాలు బహిరంగంగా కనిపిస్తున్నాయని స్థానికులు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలకు సాగునీరు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.