నిర్మించిన వారానికే కుంగిన విద్యుత్ దిమ్మె

Sep 24, 2026 - 21:15
 0  1
నిర్మించిన వారానికే కుంగిన విద్యుత్ దిమ్మె

  తిరుమలగిరి 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

సంబంధిత విద్యుత్తు అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని 11వ వార్డులో అప్పారావు ప0తులు ఇంటి వద్ద నిర్మించిన విద్యుత్ గద్దె వారం రోజుల కాకముందే నాసిరికంగా నిర్మించడం మూలంగా కుంగిపోయింది దీంతో ఏ క్షణాన కిందపడి ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు , బుధవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఒకపక్కకు ఓరగడం మూలంగా ఏ క్షణాన కిందపడి ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు తెలిపారు ఈ మూల మీద నుండి ప్రతినిత్యం స్కూలు వ్యాన్లు ట్రాక్టర్లు ప్రయాణికుల ఆటోలు ప్రజలు వివిధ పనులు నిమిత్తం వెళ్తుంటారు రోడ్డు పక్కన నిర్మించిన మూలంగా భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయని అన్నారు సంబంధిత కాంట్రాక్టర్ సక్రమంగా విద్యుత్తు గద్దెను నిర్మించకపోవడం మూలంగానే ఇది కుంగి పోయిందని తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని కోరుతున్నారు అలాగే తిరుమలగిరి మండలంలో నిర్మించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు కోసం నిర్మించిన గద్దలన్నీ నాసిరకంగా నిర్మించడం మూలంగా కూలిపోయే అవకాశం ఉందని ప్రజలు తెలిపారు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు తెలిపారు సంబంధిత విద్యుత్ కాంట్రాక్టర్ స్థానిక అధికారులు కుమ్మక్కై వారి ఇష్టానుసారముగా నిర్మిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా వారిపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి