పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కె రన్ ర్యాలీ
తిరుమలగిరి 27 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక అక్రమ రవాణా నిర్మూలన దినోత్సవం సందర్భంగా మత్తు పదార్థాల నిర్మూలనే ధ్యేయంగా తిరుమలగిరి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ (మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన) కార్యక్రమంలో భాగంగా నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. నాగేశ్వరరావు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు కలిసి 2K రన్ నిర్వహించారు. 2K రన్ తిరుమలగిరి ఎక్స్ రోడ్ నుండి పాత తిరుమలగిరి గ్రామం వరకు కొనసాగింది. యువత, ప్రజాప్రతినిధులు, పౌరులు ఈ పరుగులో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం తిరుమలగిరి ఎక్స్ రోడ్ జంక్షన్ వద్ద మాదకద్రవ్యాల వల్ల జరిగే నష్టాలపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు అవగాహన చేపట్టారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మత్తు పదార్థాల అలవాటు యువత భవిష్యత్తును, కుటుంబాలను నాశనం చేస్తుందని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో ప్రజలు, యువత స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకట్ రెడ్డి పోలీసు సిబ్బంది యువతి యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు