సూర్యాపేటలో అత్యధికంగా రూ.3 లక్షల 21 వేలు ధర పలికిన వినాయకుడి లడ్డు
గత 75 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న శ్రీ వేదాంత భజన మందిరం వారు ఏర్పాటు చేసిన లడ్డు వేలంపాటలో సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బెలిదే శ్రీనివాస్ లు అత్యధికంగా మూడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి రూపాయలకు వేలం పాటలో దక్కించుకున్నారు. గత ఏడాది రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి లడ్డు వేలం కాగా ఈ సంవత్సరం లక్ష రూపాయలు అదనంగా వేలంపాట ద్వారా ఆలయానికి ఆదాయం చేకూర్చింది. శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పూల సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత లక్షాది, ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి , మాజి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజి మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా ట్రాక్టర్ నడిపి భక్తులను విశేషంగా ఆకర్షించుకున్నారు. ఈ కార్యక్రమంలోవార్డు కౌన్సిలర్ గండూరి రమేష్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు అనంతల కృపాకర్ , రంగరాజు రుక్మారావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ , జీడి బిక్షము, బైరు వెంకన్న, భజన మందిరం అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు కార్యదర్శి నకరికంటి రాజశేఖర్ అర్చకులు ధరూర్ సింగరాచార్యులు, రాఘవాచార్యులు తదితరులు పాల్గొన్నారు.