**ఆదిరెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేద్దాం""ములకలపల్లి రాములు*

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ :**ఆదిరెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేద్దాం*
*ములకలపల్లి రాములు*
కోదాడ టౌన్ : ప్రభుత్వ బంజరాయి పోరంబోకు దేవాలయ భూములు పేదలకు పంపిణీ చేయడంలో ఆదిరెడ్డి ముందుండి పోరాటం చేసిన వ్యక్తి అని ఆయన ఆశయ సాధన కోసం మనందరం ముందుకు సాగాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు పిలుపు నిచ్చారు.
మంగళవారం కోదాడ పట్టణంలో తకదీర్ సెంటర్లో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదిరెడ్డి 28వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలనేసి ఘనంగా నివాళులర్పించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ ఆదిరెడ్డి పేదల పక్షపాతిగా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో సమరశీల పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఆదిరెడ్డి కుందని ఆయన అన్నారు ఆయన చిన్ననాటి నుండి సిపిఎం రాజకీయాలకు ఆకర్షితుడై నరసింహుల గూడెం గ్రామ సర్పంచ్ గా డివైఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులుగా రైతు సంఘం డివిజన్ కార్యదర్శిగా పనిచేసి పేదల పక్షాన నిరంతరం పోరాటం చేసిన గొప్ప నాయకుడు అని కొనియాడారు మునగాల నడిగూడెం మండలాల్లో జగన్నాధపురం రేపాల బృందావనపురం గోపాలపురం సిరిపురం తదితర గ్రామాల్లో దేవాలయ భూములను పేదలకు పంపిణీ చేయడంలో ఆదిరెడ్డి కృషి మరువలేనిదని అన్నారు ఆదిరెడ్డిని చూసి ఓర్వలేని అసాంఘిక శక్తులు మరియు కాంగ్రెస్ నక్సలైట్లు కలిసి హత్య చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు హత్యల తో ఉద్యమాలు ఆపలేదని ఆయన అభివర్ణించాడు సిపిఎం నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని గుర్తు చేశారు ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు సిపిఎం పట్టణ కార్యదర్శి ముత్యాలు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే సైదా సిపిఎం ప్రజా సంఘాల నాయకులు ఎస్ కే జానీ రామారావు సైదులు వెంకన్న లింగయ్య షేక్ రఫీ తదితరులు పూలమాలవేసి ఘనంగా జోహార్లు అర్పించారు