ఫీల్డ్ వెరిఫికేషన్ రికార్డులు  తనిఖీ చేసిన కలెక్టర్

Jan 20, 2025 - 21:21
Jan 20, 2025 - 21:21
 0  29
ఫీల్డ్ వెరిఫికేషన్ రికార్డులు  తనిఖీ చేసిన కలెక్టర్
ఫీల్డ్ వెరిఫికేషన్ రికార్డులు  తనిఖీ చేసిన కలెక్టర్
ఫీల్డ్ వెరిఫికేషన్ రికార్డులు  తనిఖీ చేసిన కలెక్టర్
ఫీల్డ్ వెరిఫికేషన్ రికార్డులు  తనిఖీ చేసిన కలెక్టర్

 గ్రామ సభలకు విస్తృత  ఏర్పాట్లు 

 జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

టేక్మాల్ (మెదక్ )తెలంగాణ వార్త ప్రతినిధి :- అందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, రూపొందించిన వివరాలను కలెక్టర్ తనిఖీ చేశారు.  వ్యవసాయ యోగ్యం గాని భూములను  సందర్శించిన కలెక్టర్,  ఆహార భద్రత (రేషన్) కార్డులు, రైతు భరోసా పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. సంబంధిత వివరాలతో కూడిన రిజిస్టర్లను తనిఖీ చేసి, గ్రామ సభల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామసభలు నిర్వహణ సమాచారం ప్రజలకు తెలిసేలా టామ్ టామ్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.16వ తేదీ నుండి 20 వ తేదీ వరకు రెవెన్యూ, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో వ్యవసాయ యోగ్యమైన, వ్యవసాయం చేయని భూముల సమగ్ర సమాచారం సేకరణ చేసారని తెలిపారు.  అట్టి జాబితాను గ్రామసభల్లో లబ్ధిదారుల జాభితా  చదివి వినిపినించి తుది జాభితా తయారు చేయనున్నట్లు తెలిపారు.  నూతన రేషన్ కార్డులకు  గ్రామ సభలలో దరఖాస్తుల స్వీకరించాలని తెలిపారు. రేషన్ కార్డులు జారీ అనేది నిరంతర ప్రక్రియని ఆయన పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్, తాసిల్దార్ తులసి రామ్ నాయక్, ఎంపీడీవో విట్టల్ నాయక్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయి శ్రీకాంత్ పంచాయతీ కార్యదర్శి రాకేష్  సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333