సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల అత్యుత్తమ ఫలితాలతో ప్రభంజనం
సూర్యాపేట, 12 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ వార్షిక పరీక్షల ఫలితాలలో సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో ప్రభంజనం సృష్టించారని ప్రిన్సిపల్ పెరుమాళ్ళ యాదయ్య తెలిపారు.
ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో తాటి ఉదయశ్రీ 980/1000,
ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ ఎల్ఎండి టీ(L M&DT) దరావత్ సరిత 984/1000,
ప్రథమ సంవత్సరంలోబైపిసి జనగాం శ్రీకర్ 431/440, హెచ్ ఈ సి (HEC)అమతుల్ రకుల్ షరియా 465/500 మార్కులు సాధించారు.
కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు ద్వితీయ సంవత్సరంలో 900 కు పైగా,ప్రథమ సంవత్సరంలో 400మార్కుల పైగా అత్యధిక విద్యార్థినీ విద్యార్థులు మార్కులు సాధించినందుకు విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు,అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగాఇంప్రూవ్మెంట్స్ మరియు ఫెయిల్ అయిన విద్యార్థుల కొరకు
- రేపట్నుంచి రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవాలనీ,
*ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ 2026 పరీక్షలకు ఫీజు
ఏప్రిల్ 13, 2026 సోమవారం నుంచి ఏప్రిల్ 20,2026 తేదీ లోపు చేసుకోవాల్సి ఉంటుందని, ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలు మే 13 వ తారీకు నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.