ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

మునగాల 05 జనవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- షరతులు లేకుండా రైతులకు రైతు భరోసా వెంటనే ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం చందా చంద్రయ్య అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని. ఇండ్లు భూమి లేని పేదలకు రూ 12000/-లు వెంటనే అమలు చేయాలని. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఇండ్ల కోసం ప్రజలు ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం వెంటనే ఇండ్లు లేని పేదలకు రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లకు నేటికి బిల్లులు రాలేదని ప్రభుత్వము వాటికి కూడా బిల్లులు మంజూరు చేయాలని కోరినారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీటిని వెంటనే అమలు చేయాలని రేషన్ కార్డులు గత పది సంవత్సరాల కాలంలో ఒక్కరికి కూడా రేషన్ కార్డులు మంజూరు చేసిన పాపాన పోలేదు తక్షణమే అర్హువులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయగలరని డిమాండ్ చేసినారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా జూలకంటి విజయలక్ష్మి బచ్చలకూర స్వరాజ్యం, మండల కమిటీ సభ్యులు స్టాలిన్ రెడ్డి,వెంకన్న, ఉపేందర్, మల్లారెడ్డి, వెంకట కోటమ్మ, నాగయ్య,కృష్ణారెడ్డి,రమేష్, తదితరులు పాల్గొన్నారు.