అతి చిన్న వయసులో వార్డు మెంబర్

Dec 19, 2025 - 12:13
 0  398
అతి చిన్న వయసులో వార్డు మెంబర్

తిరుమలగిరి 19 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

తెలంగాణలో జరిగిన మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో యువత సత్తా చాటారు సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలం లో ఇంతవరకు అతి చిన్న వయసులో నిలబడి గెలిచిన యువకుడు మండల వ్యాప్తంగా దాఖలాలు లేవు కానీ తొండ గ్రామంలో 25 ఏళ్ల యువకుడు 6 వ వార్డు మెంబర్ గా  గెలవడంతో మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ధైర్యంగా బిఆర్ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన జేరిపోతుల శ్రీకాంత్ 55 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. అత్యంత పిన్న వయసులో వార్డు మెంబర్ గా ఎన్నిక కావడం తనకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని,వార్డు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు.... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి