ఆదివాసీ హక్కుల కోసమై పోరాడాలి

Jan 6, 2026 - 19:15
 0  9
ఆదివాసీ హక్కుల కోసమై పోరాడాలి

5వ షెడ్యూల్ ప్రాంతంలో  1/59, 1/70 చట్టాలను అమలు చేయాలి

మన్య సీమ పరిరక్షణ సమితి డోలి దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య

మంగపేట న్యూస్, జనవరి :06 : ములుగు జిల్లా మంగపేట మండలం కేంద్రంలో మన్య సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ మంగపేట మండల అధ్యక్షుడు తాటి నాగరాజు అధ్యక్షతన నూతన మన్య సీమ మహిళ కమిటీ ఎన్నిక  ఏర్పాటు చేసినారు  ఈ సమావేశానికి  ముఖ్య అతిథిగా మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గొప్ప వీరయ్య హాజరై మాట్లాడుతు షెడ్యూల్ ఏరియా ఏజెన్సీ ప్రాంతంలో భారత రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన 5వ 6వ షెడ్యూల్ ఆదివాసి గిరిజన చట్టాలు 1/59 ,1/70, పెసా చట్టాలు అమలుకై పోరాడి మన హక్కులు సాధించుకొవలని మహిళా మణులు కూడా పురుషులతో సమానం గా పోరాడిన చరిత్ర ఆదివాసి సమాజానికి ఉన్నది సమ్మక్క సారక్క రాణి దుర్గావతి లాగా జల్ జంగిల్ జిమిన్ అంటూ భూమి నీరు అడివి పై హక్కుల కై పోరాడిన కొమరం భీం మొదటి తరం స్వతంత్ర సమరయోధుడు బిరుస ముండా లగా 5వ 6వ షెడ్యూల్ రాజ్యాంగ రూపకర్త జైపాల్ సింగ్ ముండా సొయం గంగులు రాంజీ గుండు గంటందొర మల్లు దొర లా స్ఫూర్తితో పోరాడి భారత రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన హక్కులను చట్టాలను జీవోలను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. మన్య సీమ నూతన కమిటీ సభ్యులుకు కండువాలు కప్పి ఆహ్వానించారు అధ్యక్షులుగా పడిగ సంధ్యbఉపాధ్యక్షులు నాలి సౌందర్య దన్నూరి కుమారి కోశాధికారి పూనెం రమణ ప్రధాన కార్యదర్శి పూసం సావిత్రి కార్యవర్గ సభ్యులు మట్టి తిరుమల ఇర్ప రజిత సుతారి ప్రమీల గండికోట ప్రమీల ముక్తి సమ్మక్క పిజ్జా నవ్య లు ఎన్నికయ్యారు ఈ కార్యక్రమానికి మన్య సీమ మహిళ జిల్లా నాయకురలు ఇర్ప అరుణ తోలేం సౌమ్య మన్య సీమ జిల్లా నాయకులు తోలేం నరసింహారావు అనేబోయిన సమ్మయ్య ఆక తిరుమల రావు తోలేం సుధాకర్ గొప్ప చంద్రకాంత్ జోగ బాబు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333