పొద్దు పొద్దున్నే కార్డెన్ సెర్చ్ 37 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలు సీజ్

Jul 26, 2026 - 06:37
 0  234
పొద్దు పొద్దున్నే కార్డెన్ సెర్చ్ 37 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలు సీజ్

 తిరుమలగిరి 26 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:

37 ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలు సీజ్... 

 ట్రాఫిక్ నియమ నిబంధనల పాటించాలి... 

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకే కమ్యూనిటీ పోలీసింగ్ నిర్వహిస్తున్నామని సూర్యాపేట డిఎస్పి ప్రసన్న కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ IPS ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారు జామున తిరుమలగిరి మండలం అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీలో డిఎస్పీ మరియు  నాగారం సీఐ నాగేశ్వరరావు తుంగతుర్తి సీఐ ఉపేందర్, ఆధ్వర్యంలో 90 మంది పోలీసు సిబ్బందితో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్ లేని 37 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ… వెహికల్ లైసెన్స్ సరైన పత్రాలు కలిగి ఉండాలని ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించి ఉండాలి రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి అలాగే యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి రవాణా చేసిన, విక్రయించినా, సేవించినా చట్ట పరంగా తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. భూ సంబంధిత గొడవల్లో పాల్గొని అమాయకులను మోసం చేస్తే కఠిన చర్యలుంటామమని తెలిపారు.గ్రామాల్లో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కనపడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. గంజాయి, గుడుంబా, ఇతర అక్రమ రవాణా వంటివి ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 ను సంప్రదించాలని, లేదా నేరుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని , సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. అలాగే ముఖ్యంగా ప్రజలు CC కెమెరాలు ఏర్పాటుకు ముందుకు రావాలని డిఎస్పీ కోరారు. ఈ తనిఖీ కార్యక్రమంలో , ఎస్సైలు వెంకటరెడ్డి చిరంజీవి వీరయ్య మధు క్రాంతి కుమార్ 90 మంది సివిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు....

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి