గర్భిణీ స్త్రీలు సమతుల్యత ఆహారాన్ని స్వీకరించాలి!

సిడిపిఓ జోస్నా

Apr 17, 2025 - 23:42
Apr 17, 2025 - 23:43
 0  42
గర్భిణీ స్త్రీలు సమతుల్యత ఆహారాన్ని స్వీకరించాలి!

అడ్డగూడూరు17 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని జానకిపురం గ్రామంలో గర్భిణీ స్త్రీలకు బలంతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.గర్భిణీ స్త్రీలు బాలింతలు సమృద్ధి ఆహారాన్ని స్వీకరించాలి అదేవిధంగా చిరుధాన్యాలు పౌష్టికమైన ఆహారం తీసుకున్నట్లయితే పిల్లల ఎదుగుదల మానసిక స్థితిగతులు సరిగ్గా ఉంటాయని సిడిపిఓ జోస్నా తెలియజేశారు.పోషణ పక్షం 1000 రోజులు ఎంతో కీలకమని అన్నారు.జానకిపురం గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలో పోషణ అభియాన్ పోషణ్ పక్వాడ పోషన్ పక్షం కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు సిడిపిఓ జోస్నా ముఖ్యఅతిథిగా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్త్రీలు చిరుధాన్యాలు మాంసకృత్తులు లభించే ధాన్యాలు ఆకుకూరలు పండ్లు గుడ్లు, మాంసాహారాలను స్వీకరించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆమె తెలియజేశారు.ఇట్టి కార్యక్రమంలో సూపర్వైజర్ మధురమ, అంగన్వాడి ఉపాధ్యాయురాలు ఉపేంద్ర, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, మరియు ఆశా కార్యకర్త లక్ష్మి, బాలింతలు గర్భిణీ స్త్రీలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.