8న గద్వాలకు CPM రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ రాక.
జోగులాంబ గద్వాల 7ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఈనెల 8వ తేదీ బుధవారం గద్వాలలో జరిగే సిపిఎం పార్టీ జిల్లా విస్తృత సమావేశంలో పాల్గొనటానికి ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ హాజరవుతున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి A.వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు.
సిపిఎం పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 8వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు గద్వాల పట్టణంలోని వాల్మీకి కమ్యూనిటీ హాల్ లో సిపిఎం జిల్లా విస్తృత సమావేశం నిర్వహిస్తున్నామని సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ హాజరవుతున్నారని. వారితోపాటు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు R. శ్రీ రామ్ నాయక్ గారు,మరియు R. వెంకట్ రాములు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ సభ్యులు హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు.
A.వెంకటస్వామి
CPM జిల్లా కార్యదర్శి
జోగులాంబ గద్వాల జిల్లా కమిటీ.