గూడెం గ్రామంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
15-08-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో గ్రామపంచాయతీ,అంగన్వాడిస్కూల్,ప్రభుత్వ పాఠశాల యందు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న గూడెం గ్రామం మాజీ సర్పంచ్ మామిళ్ళపల్లి చక్రవర్తి. పాల్గొని, పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసిన:-*
అంగన్వాడి స్కూల్ దగ్గర జెండా ఆవిష్కరణ తదనంతరం గుమ్మడం శివసాగర్ సన్నాఫ్ గుమ్మడం బాలేశ్వరయ్య విద్యార్థినీ విద్యార్థుల అవసరాలకు పలకలు,ఆడుకునే వస్తువులు, అంగన్వాడి కేంద్రానికి బకెట్లు జగ్గులు అందజేశాడు. అదేవిధంగా గ్రామం మాజీ ఉప సర్పంచ్ అయినటువంటి చిట్టెమ్మ వైఫ్ ఆఫ్ గోపాల్ పదవిలో ఉన్నంగా అంగన్వాడి కేంద్రానికి కుక్కర్ ఇప్పిస్తానని మాట ఇవ్వడం వల్ల ఈరోజు కుక్కర్ అందించి మాట నిలబెట్టుకున్న ఉప సర్పంచ్ చిట్టెమ్మ.
తదన అనంతరం గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో జెండా ఆవిష్కరణ కి గ్రామ మాజీ సర్పంచ్ మామిళ్ళపల్లి చక్రవర్తి హాజరు కావడం జరిగింది.
స్కూల్లో విద్యార్థులు ఆటపాటలతో, ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ విద్యార్థులు ఇంగ్లీషులో స్పీచ్ లు ఇచ్చి శభాష్ అనిపించారు. అదేవిధంగా కొంతమంది గ్రామ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు,ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు ఇచ్చారు.
మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ప్రతి గ్రామంలోని పాఠశాలలకు డిక్షనరీను అందిస్తే ఆ డిక్షనరీలను గ్రామ జూపల్లి అనుచరులు విద్యార్థులకు అందజేశారు.
అదేవిధంగా చిన్నంబాయి మండల వెల్టూరు గ్రామమైన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కొత్త కళ్యాణ్ కుమార్ గూడెం గ్రామ స్కూలుకి నోట్ బుక్స్ ను అందించాడు.
గూడెం గ్రామ యువకుడైనటువంటి ఎండి మక్బూల్ పాషా గ్రామంలో ఐపిఎల్ టోర్నమెంట్లో విజేతగా నిలిచి ఆ టోర్నమెంట్ లో వచ్చినటువంటి 20000 రూపాయల తోటి పెద్ద మనసు చేసుకొని విద్యార్థులకు సౌండ్ బాక్స్ సెట్ ను అందించడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ చిట్టెమ్మ గ్రామ సెక్రెటరీ,అంగన్వాడీ టీచర్, ఆశ వర్కర్లు గ్రామ పెద్దలు తోట బాలకృష్ణ, క్యాథూరి రాముడు, తెలంగాణ వార్త రిపోర్టర్ విష్ణు సాగర్, డాక్టర్ లక్ష్మోజీ, కుమ్మరి బుచ్చన్న, రాఘవేంద్ర శెట్టి, యువకులు పాల్గొన్నారు.
మాజీ సర్పంచ్ మామిళ్ళ చక్రవర్తి మాట్లాడుతూ ముందుగా విద్యార్థినీ విద్యార్థులకు యువకులకు జెండా ఆవిష్కరణలకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి
78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. మాతృ భూమి కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి బ్రిటిష్ వారితో పోరాడి, మనకు సమకూర్చి పెట్టిన ఈ స్వాతంత్ర్య భారత్ నేటితో 77 వసంతాలను పూర్తి చేసుకుందని, ఈ సందర్భంగా ఆ మహానీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగలు మనం సమాజానికి ఏవిధంగా సేవాచేయాలని మన విధులను గుర్తు చేస్తాయని అన్నారు. అనంతరం, పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.