క్రీడా పోటీలలో చిలుకూరు గురుకులాల  విద్యార్థుల ప్రతిభ

చిలుకూరు పేరెంట్స్ కమిటీ చైర్మన్ బేగరి రాజు

Nov 19, 2024 - 13:25
 0  8
క్రీడా పోటీలలో చిలుకూరు గురుకులాల  విద్యార్థుల ప్రతిభ

చిలుకూరు 19 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- మంగళవారం రోజు  మొయినాబాద్ మండల పరిధిలో చిలుకూరు గ్రామంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల శివారెడ్డిపేట్ వికారాబాద్ జిల్లా టెన్త్ జోనల్ స్థాయి  స్పోర్ట్స్ ను నిర్వహించడం జరిగింది. క్రీడల్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల చిలుకూరు  విద్యార్థులు అండర్ 14 విభాగంలో క్యారమ్స్ మొదటి స్థానం అండర్ 17 విభాగంలో ద్వితీయ స్థానం చెస్ ప్రథమ స్థానం టెన్నికాయిట్ ప్రథమ స్థానం అండర్ 19 విభాగంలో టెన్నికాయిట్ ప్రథమ స్థానం ఫుట్ బాల్ ద్వితీయ స్థానం వంద మీటర్ల పరుగు పందెం ప్రథమ స్థానం 400 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం హై జంప్ లో ద్వితీయ స్థానం 200 మీటర్స్ లో ద్వితీయ స్థానం సాధించి 1500 మీటర్స్ లో ద్వితీయ స్థానం 4×100 మీటర్స్ రిలే లో ద్వితీయ స్థానంలో డిస్కస్ త్రో ద్వితీయ స్థానం  సాధించి పాఠశాలకు చిలుకూరు గురుకుల పాఠశాలకు మంచి పేరు తీసుకురావడం జరిగింది.ఈ విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల కళాశాల ఇన్చార్జి  ప్రిన్సిపాల్ శౌరి రాజు, పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు బేగరి రాజు మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతోపాటు అన్ని రంగాలలో రాణించినప్పుడే విజ్ఞానవంతులుగా ఎదుగుతారని అన్నారు.క్రీడలు శరీర దృఢత్వ  ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడల్లో,చదువులో  రాణించి ఉన్నత స్థాయి శిఖరాలకు, అధిరోహించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ దామోదర్ గౌడ్,  పిడి ఆది బాబు, పిఈటి గురవయ్య,క్రికెట్ కోచ్ విష్ణు కాంత్,జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ పండారి,సునీత లక్ష్మణరావు, రమేష్ తదితరు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయరాలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333