4 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం ..12 గ్రామాలకు ఎన్నికలు
తిరుమలగిరి 04 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలంలోని గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా 16 గ్రామ పంచాయతీలకు నాలుగు గ్రామపంచాయతీలు సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయినవి. 1. కొక్య నాయక్ తండ గుగులోతు ప్రేమ్ ప్రసాద్ 2. రాజ నాయక్ తండ భూఖ్య బిచ్చు 3. సిద్ధి సముద్రం ధరావత్ సుజాత 4. మొండి చింత తండ, మరియు 37 వార్డులు ఏకగ్రీవం అయినవి. 12 గ్రామపంచాయతీలు సర్పంచ్ మరియు 95 వార్డులు కు ఎన్నికలు జరుగుతున్నవి. పోటీలో నిలిచిన అభ్యర్థులు 28 మంది సర్పంచ్ అభ్యర్థులు మరియు 192 మంది వార్డులకు పోటీలో ఉన్నారని ఎంపీడీవో లాజర్ తెలిపారు.