3వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేసిన నిర్మాల గిరిబాబు

Jan 30, 2026 - 22:20
 0  2
3వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేసిన నిర్మాల గిరిబాబు

తిరుమలగిరి 31 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డు జనరల్ స్థానం కావడంతో మూడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నిర్మాల గిరిబాబు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం వారు మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మూడవ వార్డులో ఉన్న సమస్యలను గుర్తించి, ప్రజలు కోరుకున్న అభివృద్ధిని తప్పక సాధిస్తానని హామీ ఇచ్చారు. తమ కుటుంబం ప్రజలతో ఉన్న అనుబంధం, వారి సేవా భావం విజయం సాధించే బలం అవుతుందన్న నమ్మకం వ్యక్తం చేసిన వారు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు..

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి