16వ వార్డు ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు
*16వ వార్డు ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు*
16వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్‌గా నన్ను గెలిపించి ఆశీర్వదించిన ప్రతి ఓటరుకు నా హృదయపూర్వక పాదాభివందనాలు.
నా గెలుపు కోసం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేసిన పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, నా మిత్రులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
*ఈ విజయం నాది కాదు… ఇది 16వ వార్డు ప్రజల విజయం. ఇది మనందరి విజయం*.
ఎన్నికల సమయంలో నేను ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేర్చుతాను. వార్డు అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాను. ప్రతి సమస్యను నా స్వంత సమస్యగా భావించి పరిష్కారం కోసం ముందుంటాను.
నేను నాయకుడిగా కాకుండా… మీ సేవకుడిగా పనిచేస్తానని ఈ సందర్భంగా మరొక్కసారి వాగ్దానం చేస్తున్నాను.
*మీ విశ్వాసానికి వందనాలు*.
*మీ ఆశీర్వాదంతో 16వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుదాం*
ఇట్లు
షేక్ జహీర్ 16వ వార్డు కౌన్సిలర్