హోటళ్లు, రెస్టారంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వాడే వంటగ్యాస్ ధరను
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి.

దేశ రాజధాని దిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.30.50 తగ్గి రూ.1,764.50కు చేరింది. రాష్ట్రాలను బట్టి ఈ తగ్గింపులో మార్పు ఉంటుంది. పట్నాలో గరిష్ఠంగా ఒక్కో సిలిండర్‌పై రూ.33 వరకు తగ్గింది. హైదరాబాద్‌లో రూ.32.50 తగ్గి రూ.1,994.50కు, విశాఖపట్నంలో రూ.32 తగ్గి రూ.1,826.50కు చేరింది. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.
మరోవైపు ఐదు కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ ధరను సైతం రూ.7.50 తగ్గించారు.