హైదరాబాద్‌లో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ భగ్నం 

Jun 13, 2026 - 19:32
 0  1
హైదరాబాద్‌లో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ భగ్నం 

హైదరాబాద్, జూన్ 13: నగరంలోని ఎల్బీనగర్ పరిధిలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్‌ను పోలీసులు భగ్నం చేశారు. వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌పై పోలీసులు డికాయ్ ఆపరేషన్ నిర్వహించారు. హాస్పిటల్ డైరెక్టర్ కొర్ర రాజు సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మహిళా పోలీసును డికాయ్‌గా పంపి ఆధారాలు సేకరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తామంటూ హాస్పిటల్ సిబ్బంది హామీ ఇచ్చారు. నిందితులు తుక్కుగూడలోని ఓ క్లినిక్‌కు గర్భిణులను రిఫర్ చేశారు. క్లినిక్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్‌ను పోలీసులు పట్టుకున్నారు. రిసెప్షనిస్ట్ లోకేశ్‌ను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు.. ముగ్గురిపై పీసీపీఎన్‌డీటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. గర్భంలోని శిశువు లింగాన్ని వెల్లడించడం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు. అక్రమ లింగ నిర్ధారణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ అంశంపై కేసు నమోదు చేసిన వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333