పోలీసు అధికారుల నెలవారి సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్.

Jun 13, 2026 - 19:29
Jun 13, 2026 - 20:52
 0  1
పోలీసు అధికారుల నెలవారి సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్.
పోలీసు అధికారుల నెలవారి సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్.
పోలీసు అధికారుల నెలవారి సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్.

బాధితులకు భరోసా, భద్రత కల్పించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యం: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ.

సూర్యాపేట 13 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి తో కలిసి ఈరోజు జిల్లా పోలీసు అధికారుల నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని శాంతిభద్రతలు, కేసుల దర్యాప్తు పురోగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. గత నెలలో నమోదైన కేసుల పూర్వాపరాలను నిశితంగా పరిశీలించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు తక్షణ భరోసా, రక్షణ కల్పించడమే పోలీస్ శాఖ ప్రథమ కర్తవ్యమని ఎస్పీ గారు స్పష్టం చేశారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాల పై  పటిష్ట నిఘా ఉంచి  నివారించాలని ఆదేశించారు. బాధితుల ఇంటి వద్ద నుండి కేసు నమోదు చేసే విషయంలో అలసత్వం వహించకూడదని డోర్ స్టెప్ ఎఫ్ఫైర్ పటిష్టంగా అమలుచేయాలని సూచించారు. కేసుల ఛేదనలో శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలతో పని చేయాలి, సాక్ష్యాధారాలను పక్కాగా నమోదు చేయాలి అన్నారు. సాక్షులను చైతన్య పరిచి, నేరస్థులకు త్వరితగతిన శిక్షలు పడేలా కోర్టు అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలి. ప్రజలు, బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి, కేసుల సంఖ్యను తగ్గించేలా పనిచేయాలి. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా క్షేత్రస్థాయిలో పటిష్టమైన చర్యలు చేపట్టాలి.  గ్రామాల్లో భద్రతా వలయాలు ఏర్పాటు చేయాలి. నేరాలు జరిగినప్పుడు పక్కా ఆధారాలు లభించేలా సీసీ కెమెరాల వ్యవస్థను బలోపేతం చేయాలి. స్థానిక ప్రజలు, వ్యాపారులు తమ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలి అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాల పట్ల జాగ్రత్తలు, మహిళల భద్రత వంటి ముఖ్యాంశాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి అన్నారు.

ఈ సమావేశంలో జిల్లాలోని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, డిసిఆర్బి డీఎస్పీ రవి, ఏఆర్ డీఎస్పీ నరసింహ చారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మగ్దూం అలీ, CI లు రాజశేఖర్, వెంకటయ్య, నాగేశ్వరరావు, శివ శంకర్, చరమందరాజు, రామకృష్ణ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఏసీ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333