స్థానిక సంస్థల్లో బీసీలకి 42 శాతం రిజర్వేషన్ ప్రకటించడం హర్షించదగ్గ విషయం.... పచ్చిపాల రామకృష్ణ

మునగాల 01 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: స్థానిక సంస్థలలో ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు బిల్లు ఆమోదించడం స్వాగతిస్తున్నామని బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా లో అధిక శాతం ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామనడం హర్షణీయమని దీనికోసం బీసీ ఉద్యమ నేత రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హైకోర్టులో ఫిల్ దాఖలు చేశారని గుర్తు చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం జీవో దారి చేసి పంచాయతీ మునిసిపల్ చట్టాలను సవరణ చేసి బీసీలకు సంపూర్ణంగా 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లున్నారు